Friday, February 17, 2012

Tuesday, December 28, 2010

చెలీ...! నిన్ను చేరే చిరుగాలినై,

చెలీ...! నిన్ను చేరే చిరుగాలినై,
నువ్వు వాడే సుగంధాన్నై,
నీ సుతి మెత్తని స్పర్శతో కవితలల్లే కలాన్నై,
నీ కనుల క్రింది కాటుకనై నిత్యం నిన్నే చూడాలని
నీతోనే ఉండాలనే నా మనసుకు తెలుసు నిన్నెంతగా ప్రేమిస్తున్నానో.....
Manu...

Wednesday, July 21, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

చెరువు గట్టున చల్లగాలి వీస్తుంటే నా మనసున నీవు సంగీత సరిగమలు మోగిస్తుంటే
అలలు నీ అందమైన పాదాలపట్టీలను తాకుతుంటే అందునుండి వచ్చే స్వరం సుస్వరపు
వీణలా నా మనసును మీటుతుంటే వెన్న లాంటి నా హృదయం వేలరగాలు వింటుంటే
కోకిల లాంటి నీ రాగం కోటినాదాలై పలుకుతుంటే అద్బుతం కదా.....ప్రియా
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

అందమైన అపురూప సౌందర్య వనమా,
నా హృదయంలో పూసిన ప్రేమ పుష్పమా,
నీ పుట్టుకకు ఏ పుణ్యఫలము తోడయ్యేనో కానీ,
నీవే నా ప్రపంచం అయ్యావు.....
Manu...

Monday, July 19, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

కోకిల వసంతం కోసం ఎదురు చూడక పోవచ్చు,
ఎడారి వర్షం కోసం ఎదురు చూడక పోవచ్చు,
చీకటి వెన్నెల కోసం ఎదురు చూడక పోవచ్చు,
కానీ నా మను"సు ప్రాణం పోయే వరకు ఎదురు చూస్తుంది చిరు ఆశతో...నీ కోసం.
Manu...

Thursday, July 1, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

నీలి మబ్బు జారవిడిచిన కాంతి రేఖవో
వాన మబ్బు నేల రాల్చిన అమృత చినుకువో
ఏ దేవుడు సృష్టించాడో కానీ సృష్టిని మరిపించే నీ రూపం
నీవు నా కనుల ముందు కనిపించిన ఆ క్షణం అధ్బుతం కదా.....?
Manu...

Wednesday, June 23, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

కోకిల గానం నీదైతే ఆ రాగం నేనవుతా,
కమ్మని కవిత నీవైతే ఆ కవిత రాసే కలాన్నవుతా,
పూసే పూవువి నీవైతే నిత్యం నీ వెంటే ఉండే తుమ్మెదనవుతా,
నా హృదయం నీవైతే ఊపిరి నేనవుతా,
నీవు ప్రేమిస్తే నా ప్రాణం ఉన్నంతవరకు నీతో ఉంటా.....
Manu...

Tuesday, June 22, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

అందమయిన నీలాకాశంలో మెరిసేటి అపురూప సౌందర్యమా
నా హృదయంలో పరిమళించిన పావన పుష్పమా
ఏ రాగంతో కరిగించావో కానీ నా మనసు మాట వినటంలేదు ఎటు చుసిన నీ రూపమే
ఏ వైపు చూసినా నీ ద్యాసలె.......
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

పున్నమిలోని వెన్నెలనీ
పుత్తడిలోని పసుపునీ
రోజాలోని రంగునీ
చందనంలోని సుగంధాన్నీ
కలిపి ముద్దగా చేసి రవి వర్మ
మలచిన బొమ్మలాంటి నీ అందం
నన్ను నాలో లేకుండా చేస్తోంది....
ఇది నీ తప్పు కాదంటావా..?
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

జాబిలమ్మ నిన్ను చూసి దాక్కోన్నది
చిలకమ్మా నీ మాటవిని చిన్నబోయినది
కోకిలమ్మ నీ పాట విని మనసు మార్చుకొన్నది
ప్రకృతి ఒడిలో మరో అందాల యువరాణి స్నేహం చేస్తుందని
అలాంటి నిన్ను ఒక్క క్షణం చూసి విడిచి ఉండగలనా......
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

నేను ఆలోచిస్తాను ప్రతి క్షణం నీ కోసం
నీలాల సముద్రపు ఒడ్డున నీ తలపుల వాకిట నిలిచి
నీ కోసం ఆలోచిస్తుంటే ఎగసే కెరటాలు వెక్కిరిస్తున్నాయ..?
ఉత్సాహంతో ఉపునిస్తున్నాయా అర్థం కానీ అలజడిలో ఉన్నాను
నేను నీ లోకంలో విహరిస్తూ....
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

ప్రేమలోని మాధుర్యం తేనేలోని తీపిదనం
రెండు వేరు వేరు,తేనేలోని తీపిదనం రుచిమయం అయితే
ప్రేమలోని మాధుర్యం మనసు మయం........నీ మయం.
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

హృదయం లేని నా ఉహలకు నీ హృదయాన్ని తోడిచ్చి
అప్పుడే విచ్చుకున్న జాజుల సువాసనతో నా మనసుని
మైమరపించి నీ దారి తెలియని నాకు గాలిలోని పరిమళం మళ్ళించింది నీ వైపు
ఇది కలయా నిజామా అని తెలుసుకొనే లోపే ఇది నిజం అని చెప్పే పగలు
సాయంత్రం ఒడిలోకి చేరుతోంది...అయితేనేం నేనున్నానంటూ స్నేహ హస్తం అందిస్తోంది
ఈ వెన్నెల సాయంత్రం.......మరి నీ మాటేంటి ప్రియతమ.....
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

నా మనసుకి తెలుసు ప్రేమించే హృదయపు లయలు
సరిగమల ఆలాపనలు అవి సప్తస్వరాల సెలయేరులు
గల గల సవ్వడులు ఏ భాష చాలును ప్రియా నీ నయగారపు అందాల వర్ణనకు.
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

వేకువలో వసంతమై
నా హృదయంలో జాబిలివై
నీ నవ్వుల మల్లెలు విసురుతూ
నన్ను మరిపిస్తావు నీ కనుల వాకిట
నీ చూపుల గాలమేసి నిలదీస్తావు
కలలతో కలవర పెడతావు నీకు న్యాయమా.....
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

పున్నమి వెలుగులో పుత్తడి మెరుపుతో వస్తావు
నా మనసుని మరిపిస్తావు నీ ఉహల మత్తులో
ముంచేస్తావు ఎటూ తెలియని నా మనసు నీ దారిలోనే గమ్యం అంటూ
పరుగెడుతోంది ఈ మంచి మనసుకు నీ తోడు నందిస్తావని ఆశతో ఎదురు చూస్తోంది
నా హృదయం............
Manu...

Monday, June 21, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

వంసంతానికి ఆమనీ తొడుగులు అందం తెస్తే
నా హృదయానికి నీ ఆలాపనలు అసరనిస్తాయి
పూలకు రంగులు ఆకర్షణ అయితే నాకు నీ నవ్వులు ఆనందం
ప్రకృతికి కోకిల పాటలు నేర్పితే నీ ఉచ్వాస నిచ్వాసాలు నాకు ఉపిరినిస్థాయి
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

నా తొలి కవిత నీతో ప్రారంబమై నీ వెంటే ప్రయాణించే
కాలమనే దారిలో నడుస్తోంది.ఈ పయనం ఎవరికోసమా అని అరా తీస్తే
అసలనిపించింది నీ అందమైన కురుల చీకటిలో కాలమంత దారితెలియని వాడినై తిరుగుతానని
నీ కనుల కాంతికి అ చీకటి పొరలు తోలిగిపోయెను....నీ సౌందర్య వదనం దర్శనమిచ్చెను.
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

నీ ప్రేమకై వేచే నా హృదయం ఆణువణువూ తపిస్తోంది ప్రతినిమిషం
ఆకాశంలో కనిపించే తెల్లని మేఘాలను చూసి నీవు పంపిన
ప్రేమలేఖలు అనుకున్నాను కానీ అవి నన్ను దాటేసి పోతున్నాయి అని తెలుకునేలోపే
చల్లబడి చినుకులు రాల్చింది నాపై..నీ చినుకుల చల్లదనానికి నేను నీ మాయలో ఉన్నానని తెలిసింది..
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

పూలకు పరిమళం మధురం
మనసు ప్రేమించటం మధురం
నేనంటే ఎవరో తెలియని నాకు నీ
ప్రేమ తెలిపింది ప్రేమించటం మధురాతి మధురం అని...
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

అందమైన నీలాకాశంలో కనిపించే ప్రతి హరివిల్లు నీవే
శున్యంగా ఉన్న నా హృదయంలో చిగురించిన తొలి ప్రేమవు నీవే
చీకటిలో కనిపించిన చిరుదివ్వెల వెలుగువు నీవే..
మండు టెండలో పలకరించిన చల్లని గాలివి నీవే
నా మనసును మరిపించిన మరపువు నీవే
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

చిరునవ్వుతో ప్రతి ఉదయం పలకరించి
పూల పరిమళంతో నవనీత మధువులను నింపుకొని
సెలయేటి పరవళ్ళతో నా మదిని నీ వైపు మరలించి
అందమైన ఈ వసంతపు మల్లెల తోటలో విచ్చుకున్న ప్రతి పువ్వు
నీ నవ్వు వలె తలపిస్తోంది ఇది నీ మాయ కాదంటావా........
Manu...

Sunday, June 20, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

ప్రపంచమంతా మననుండి దూరం వెళ్ళినా నీ పెదాల్లో చిరునవ్వును చేరగనివ్వను,
నువ్వు నడిచేదారిలో రోజాపూలు లేకుంటే నా అరచేతుల్లో నడిపిస్తా,
పసిపాపలా చూసుకుంటా..............
Manu...

Friday, June 18, 2010

నా కవితలు నీకు చిరు కానుకలు

ఎటు చూసినా నీ రూపమే..అ ఆలోచన చేసిన నీ ద్యాసలె..
పూలతో పలకరిస్తావు..జాబిలితో పలకరిస్తావు..
నీకోసం నన్ను నేనే మరిచిపోతాను నీ ఆలొచనల కౌగిలిలో కలవరిస్తూ
నన్ను మరచిన నా హృదయానికి నీ ప్రేమకవాలని........
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

నీ తొలి పరిచయం నాలో నింపింది తీయని అనుబూతుల అలజడి,
నా ఊహలు సంగీత సరిగామలై నీ అందమైన అందెలపై ఆడే గజ్జెల సవ్వడిలో
కలుస్తుంటే మురిసిపోతూ కల కాలం కళలు కనాలని నేననుకోను నీ మలి
పరిచయం కోసం చూసే నా మనసు కి తెలుసు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో..
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

కవిత్వం తెలియని నాకు కలలో కనిపిస్తావు
ఊహల లోకంలో విహరించేల చేస్తావు
నా మనసు దోచి నన్ను నాలో లేకుండా చేస్తావు
స్వచ్చమయిన గాలి తాకిడికి సముద్రంలో అలలు రేపినట్టు
నా హృదయంలో నీ నవ్వుల అలజడులు రేపుతావు
తెలియని ఆనందాన్నిస్తావు..ఇది నీ మాయెగా...
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

తొలిసారి పరిమళించిన రోజా లాంటి
నీ నవ్వు లోంచి పుట్టింది ఓసప్తస్వరాల
సంగీత జల్లు ఆది చిలికి చిలికి అమృత
వర్షంలా కురిసింది నా పై మోడుబారిన
నా జీవితంలో వసంతం చిగురించేలా చేసింది నా ఆశల
ఆలోచనలకి అమృతాన్ని అందిచినది నీవేగా......
Manu...

నా కవితలు నీకు చిరు కానుకలు

ప్రేమంటే ఏమిటో తెలియని నాకు ప్రేమించే మానసఉందని తెలియ చెప్పి,
ప్రేమించేలా చేశావు మనసా,మౌనానికి మాటకి మద్యలో వున్న నేను నీ దారి తెలియక
వెతికాను ప్రతి గ్రహ తారలు,అపుడు కనిపించింది నీ రూపం సౌందర్య రూపం.......
Manu..